దుకాణాలకు వెళ్లినప్పుడు అక్కడి సేల్స్‌మెన్స్‌ను, వ్యాపారులను మహిళలు విసిగిస్తారు.రూ.1500ల ధర ఉండే వస్తువును రూ.150కి బేరం ఆడగల సత్తా కేవలం మహిళలకే ఉంటుంది.కొనే వస్తువు ఒకటే అయినా, షాపులో ఉన్న వస్తువులన్నీ చూపించాలని అడుగుతారు.ఖరీదైన వస్తువులను చాలా తక్కువకు బేరం ఆడి, షాపు వాళ్లకి తలనొప్పి రప్పిస్తారు.ఏదేమైనా చాలా తక్కువ ధరకే వస్తువులు కొనుగోలు చేస్తుంటారు.ఇది చూసిన మగవాళ్లకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది.
కొందరు మహిళలు షాపింగ్‌కి వెళ్తూ, కొన్ని పనికిమాలిన పనులు చేస్తుంటారు.షాపు వాళ్లను మాటల్లో పెట్టి కొన్ని వస్తువులను కాజేస్తుంటారు.
ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కొందరు అమ్మాయిలు ఓ దుకాణానికి ( Shop ) వెళ్లారు.అక్కడ వ్యాపారిని తమకు నచ్చిన వస్తువలను చూపించాలని కోరారు.దీంతో ఆ వ్యాపారి వారికి కావాల్సిన వస్తువులను చూపించాడు.తమకు అవి కావాలని, ఇవి కావాలని అలా మాటల్లో పెట్టారు.
ఆ వ్యాపారి చాలా ఓపికగా వారికి కావాల్సిన వస్తువులు చూపిస్తూ, వాటి ధరను వివరిస్తున్నాడు.
ఇంతలో వారితో పాటు వచ్చిన ఓ అమ్మాయి తుంటరి పని చేసింది.దుకాణంలో ఓ గాజుల సెట్‌ను( Bangles ) చటుక్కున మాయం చేసింది.తన రెండు కాళ్ల మధ్యలో పెట్టుకుంటుంది.
ఈ తతంగాన్ని వారి వెనుకే ఉన్న వ్యక్తి వీడియో తీశాడు.ఇలాంటి కస్టమర్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఓ రూ.100 ధర ఉండే వస్తువును దొంగిలించడం ఏంటని, ఆ మాత్రం ధర పెట్టి కొనుక్కోలేరా అంటూ విమర్శిస్తున్నారు.