దేశవ్యాప్తంగా గత కొద్ది రోజుల నుండి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ పలు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.
ఈ క్రమంలో తప్పనిసరి మాస్క్ తో పాటు గుంపులు గుంపులుగా ప్రజలు కూడుకోకూడదని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి.ఇటువంటి క్రమంలో కేసులు మళ్లీ పెరుగుతూ ఉండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM YS Jagan )అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు.

కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు.గ్రామస్థాయిలో టెస్టులు చేసి అక్కడే మందులు ఇవ్వాలని కోరారు.ప్రతి విలేజ్ క్లినిక్ కూ కిట్స్( Village Clinic Koo Kits ), మందులు పంపాలి.అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ కి అధికారులు వివరించడం జరిగింది.ఏది ఏమైనా కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తూ ఉండటంతో… కేసులు పెరుగుతూ ఉండటంతో జనాలలో మళ్ళీ కరోనా భయం స్టార్ట్ అయింది.
దేశవ్యాప్తంగా కొత్త కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో కేంద్రం కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ ఉంది.







