ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాకు పార్ట్ 1 ఇప్పటికే రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.
ఇక ఇప్పుడు మరింత గ్రాండ్ గా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన సినిమా షూట్ లో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న షారుఖ్ ఖాన్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు.ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమాల్లో ‘జవాన్’ (Jawan Movie) ఒకటి.
ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee Kumar) డైరెక్ట్ చేస్తున్నాడు.పఠాన్ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుండడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినట్టు వార్తలు వచ్చాయి.మరి తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా తన పాత్రను పూర్తి చేసినట్టు టాక్.బన్నీ జవాన్ లో తన పాత్రకు సంబంధించిన షూట్ పూర్తి చేయడంతో ఈ సినిమా నుండి త్వరలోనే రిలీజ్ కానున్న టీజర్ లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇదే నిజమైతే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.

ఎందుకంటే గత రెండు రోజుల క్రితం పుష్ప నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది.దీంతో ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చాయి అనే చెప్పాలి.ఇక ఇప్పుడు అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేసిన జవాన్ నుండి కూడా సర్ప్రైజ్ అప్డేట్ వస్తే ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు.జూన్ 2న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.







