కొన్నేళ్ల క్రితం వరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్లు అయితే అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్లకు మాత్రమే ఎక్కువగా ఆఫర్లు వచ్చేవి.అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి.
ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హీరోయిన్లకే ఎక్కువగా ఆఫర్లు రావడంతో పాటు ఎక్కువమొత్తంలో రెమ్యునరేషన్లు అందుతున్నాయి.సాయిపల్లవి, శ్రీలీల, కీర్తి సురేష్, కృతిశెట్టి( Sai Pallavi, Srileela, Keerthy Suresh, Kritishetti ) గ్లామర్ గా కనిపించడం కంటే అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్నారు.
పొట్టి దుస్తుల్లో కనిపించడానికి ఈ హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.ఈ హీరోయిన్లే వెండితెరపై సత్తా చాటడంతో పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు.
బుల్లితెర టాప్ యాంకర్ సుమ( Anchor suma ) కూడా ట్రెడిషనల్ గా కనిపించడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.అందాల ఆరబోతలే హీరోయిన్లకు, యాంకర్లకు మైనస్ అవుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గ్లామర్ గా కనిపించడం తప్పు కాకపోయినా హద్దులు దాటి అందాల ప్రదర్శన మాత్రం మైనస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమా, టీవీ రంగాలలో మారిన ఈ పరిస్థితి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే లేడీ సెలబ్రిటీలకు బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.కొంతమంది లేడీ సెలబ్రిటీలు గుర్తింపు రాగానే సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు.గ్లామర్ షోల వల్ల కొంతమంది సెలబ్రిటీలపై నెటిజన్ల నుంచి సైతం నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను అందుకుంటున్న సంయుక్త మీనన్( Sanyukta Menon ) సైతం అభినయ ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సంగతి తెలిసిందే.సంయుక్త మీనన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
వరుస విజయాలతో సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ సైతం పెరుగుతోందని తెలుస్తోంది.స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.







