బలగం సినిమా( Balagam ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాలో నటించిన నటీనటులు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను సైతం వెల్లడిస్తున్నారు.బలగం సినిమాలో నటించిన కోట జయరాం( Kota Jayaram ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈటీవీలో నా ప్రస్థానం ఎక్కువగా నడిచిందని అయన కామెంట్లు చేశారు.
దూరదర్శన్ లో కూడా చిన్నచిన్న రోల్స్ చేశానని ఆయన పేర్కొన్నారు.
విజయ్ యాదవ్( Vijay Yadav ) నాకు అవకాశాలు ఇప్పించారని నేను 86 బ్యాచ్ అని కోట జయరాం తెలిపారు.
అప్పట్లో దూరదర్శన్( Doordarshan ) తప్ప ఏం లేదని ఆయన కామెంట్లు చేశారు.నా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు చాలానే ఉన్నాయని కోట జయరాం కామెంట్లు చేశారు.
సినిమాల్లో నటించే నటీనటులు అదృష్టవంతులు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఒక సినిమా సమయంలో కెమెరామేన్ నేను బాగా యాక్ట్ చేస్తుండటంతో నాపై ఫోకస్ పెడతానని చెబితే మరో వ్యక్తి అతనిపై ఎందుకు కుక్కపై పెట్టు అన్నాడని బలగం ఫేమ్ కోట జయరాం కామెంట్లు చేశారు.కుక్కకు ఉన్న విలువ ఆర్టిస్టులకు లేదా అని నాకు బాధ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు.ఒక కో డైరెక్టర్ నా విషయంలో ఈ విధంగా బిహేవ్ చేయడం జరిగిందని జయరాం వెల్లడించారు.

సినిమా ఇండస్ట్రీలో కుక్క కంటే హీనంగా మనిషిని చూస్తారని ఆయన తెలిపారు.ఇండస్ట్రీలో అవమానాల గురించి కోట జయరాం వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.ఆ వ్యక్తి దగ్గర నేనెప్పుడూ మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు.కొంతమంది సినిమా వాళ్లను చాలా లోకువగా చూస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.బ్రతకటానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయని ఇప్పుడు సులువుగానే సినిమా, టీవీ రంగాలలో అవకాశాలు దొరుకుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.







