వరల్డ్ ట్రేడ్ సెంటర్…( World Trade Center ) దీని గురించి తెలియని వారు దాదాపుగా వుండరు.న్యూయార్క్ నగరంలోని( New York ) సెంట్రల్ ప్లాజా చుట్టూ ఉన్న అనేక భవనాల సముదాయమే వరల్డ్ ట్రేడ్ సెంటర్.2001లో దీనిపైన అత్యంత ఘోరమైన తీవ్రవాద దాడి జరిగింది.దాంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోయింది.
అమెరికా చరిత్రలో ఇదొక మాయని మచ్చగా చెప్పుకుంటూ వుంటారు.ఈ సముదాయాన్ని హడ్సన్ నది ఒడ్డున, వాల్ స్ట్రీట్‌కు వాయువ్యంగా కొన్ని బ్లాకులకు సమీపంలో న్యూయార్క్ మరియు న్యూజెర్సీ యొక్క పోర్ట్ అథారిటీ కేంద్రం నిర్మించింది.

అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొన్న వ్యాపారాలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల కోసం దీని నిర్మాణం చేపట్టడం జరిగింది.2001 దాడి వరకు, ఇది భారీ జంట టవర్లకు ప్రసిద్ధి చెందింది.వీటిలో ప్రతి ఒక్కటి 110 అంతస్తులను కలిగి ఉంటుంది.వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైకప్పు 1,368 అడుగులు అంటే ఇక ఊహించుకోండి.కాగా ఇది ఏప్రిల్ 1973లో ప్రారంభించబడింది.ఒక్కొక్క జంట టవర్లలో 97 ప్యాసింజర్ ఎలివేటర్లు, 21,800 కిటికీలు మరియు దాదాపు ఒక ఎకరం (0.4 హెక్టార్) ఒక అంతస్తులో అద్దెకు ఇవ్వదగిన స్థలం ఉన్నాయి.అదేవిధంగా 360 అడుగుల (110 మీటర్లు) ఎత్తులో టెలివిజన్-బ్రాడ్‌కాస్టింగ్ జరుగుతుంది.

అసలు విషయానికొస్తే, ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉరుములతో కూడిన భారీ వర్షం, పిడుగులు పడ్డాయి.దాంతో అదే ప్రాంతంలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనం వద్ద ఓ భారీ పిడుగు( Lightning Storm ) పడింది.సరిగ్గా అదే సమయంలో ఓ ఫోటోగ్రఫార్ దాన్ని చక్కగా చిత్రీకరించాడు.546 మీటర్ల ఎత్తున్న ఆ భవనంపై ఒక్కసారిగా భారీ పిడుగు పడటాన్ని మీరు ఇక్కడ వీడియోలో చూస్తే విస్తు పోతారు.ఈ వీడియోను ప్రముఖ న్యూయార్క్ ఫోటోగ్రాఫర్ మాక్స్ గులినై ట్విట్టర్ లో షేర్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







