వైరల్: పెళ్లి వేడుకలో తుపాకీ పేల్చిన నవవధువు.. మిన్నకున్న వరుడు, విషయమిదే!

పెళ్లి సీజనో ఏమో కానీ సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు ( Marriages ) సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఈ మధ్య కాలంలో వైరల్ కావడం చూస్తూ వున్నాం.ఈ క్రమంలోనే ఓ వధువు ( Bride ) తన పెళ్లి వేడుకలో తుపాకీతో( Gun ) హల్‌చల్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

 Bride Firing Pistol In Her Wedding Video Viral Details, Bride, Groom, Viral Late-TeluguStop.com

ఆమె తుపాకీని తీసుకొని ఓ 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినా పక్కన వున్న వరుడు నాకేమి తెలియదన్నట్టు మిన్నకున్నాడు.దాంతో ఈ విడియోపైన నెటిజన్లు తమదైన రీతిలో చవాక్కులు పేల్చుతున్నారు.

ఇక వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే… పెళ్లి మండపంలో వధూవరులు ఇద్దరు ఆసీనులై వున్నారు.అదే సమయంలో పెళ్లి కూతురు అన్నయ్య అయి ఉంటాడు! అతగాడు వచ్చి వధువుకి ఓ పిస్టల్ ఇస్తాడు.ఇచ్చిందే ఆలస్యమనుకొని ఆమె క్షణం కూడా ఆలోచించకుండా ఆ పిస్టల్ చేతితో పేలి లేపి గాల్లో వరుసగా మూడు రౌండ్లు పోలీసులు మాదిరి కాల్పులు జరుపుతుంది.అదే సమయంలో ఆ పక్కనే వున్న వరుడు మాత్రం తనకేమి సంబంధం లేదన్న మాదిరి వ్యవహరించడం కొసమెరుపు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్ హథ్రాస్‌లోని సాలెంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా ఇపుడు ఆ తంతు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది.ముఖ్యంగా ఈ చర్య జరిగినపుడు కదలకుండా కూర్చున్న వరుడు అది తప్పని చెప్పడం గానీ, ఆపమని గానీ చెప్పలేదు.వధువు తుపాకీ పేల్చిన వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌ అయ్యి ఆఖరికి పోలీసుల దృష్టికి వెళ్ళింది.

దాంతో పోలీసులు కాల్పులకు సంబంధించి విచారణ చేపట్టారు.నెటిజన్లయితే ఆ వధువు గురించి కామెంట్లు పెట్టడం కంటే వరుడు గురించే ఎక్కువగా కామెంట్స్ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube