పై చదువులకోసం అమెరికా వెళ్లాలా? అయితే మీకు చేదువార్తే ఇది!

అవును, అమెరికా ( America ) వెళ్లి పై చదువులు చదివి స్థిరపడాలనుకుంటున్న విద్యార్థులకు ( Students ) అమెరికా ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.స్టూడెంట్ వీసాల( Student Visa ) ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించి, కలకలం రేపింది.

 Us Hikes Student Visa Processing Fee Details, America, Higher Education, Bad New-TeluguStop.com

ఈ విషయాన్ని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా వెల్లడించింది.నాన్ ఇమిగ్రెంట్ వీసాల అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇకనుండి ఖర్చు పెరగనుంది.

కాగా ఈ ఏడాది మే 30 నుంచే పెంచిన ప్రాసెసింగ్ ఫీ అమల్లోకి వస్తుందని వెల్లడించింది.ఈ క్రమంలో టూరిస్ట్, విజిటర్, బిజినెస్, స్టూడెంట్, ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాలన్నింటికీ ఇది అమలు కానుందని తెలుస్తోంది.

Telugu America, Bad, Hb Visa, Latest, Joe Biden, Visa Fee, Usa Foreign, Usa Visa

అయితే ఎక్స్ఛేంజ్ విజిటర్ వీసాలకు సంబంధించిన రెండేళ్ల రెసిడెన్సీ ఫీ సహా ఇతర కాన్సులర్ ఫీలలో ఎలాంటి మార్పులు లేవని ఈ సందర్భంగా స్పష్టం చేసింది అగ్రరాజ్యం.అక్టోబర్ 1, 2022 నుంచి వీసా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లందరికీ ఈ పెంచిన ఫీలు అమలవుతాయని వెల్లడించింది.అంతేకాకుండా పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ కూడా పెరగనుంది.దాంతో విదేశాల్లో ఉన్న భారతీయుల్లో గుబులు మొదలైంది.జాబ్ సెక్యూరిటీ విషయంలో అయితే తెగ కంగారు పడిపోతున్నారు.ఈ క్రమంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు కనబడుతోంది.

Telugu America, Bad, Hb Visa, Latest, Joe Biden, Visa Fee, Usa Foreign, Usa Visa

ఇకపోతే, ఈ మధ్యకాలంలో అక్కడ భారీ ఎత్తున లేఆఫ్ లు జరుగుతున్న నేపథ్యంలో 60 రోజుల్లోనే మరో ఉద్యోగం చేసుకొమ్మని సదరు ఉద్యోగులకు చెప్పింది బైడెన్ యంత్రాంగం.అంటే హెచ్1బి వీసాతో అమెరికాలో ఉన్న ఉద్యోగులు, జాబ్ పోయాక 60 రోజుల్లోగా మరో కంపెనీలో చేరాలి.అయితే, ఈ గడువుని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచినట్టు తెలుస్తోంది.వేలాది మంది హెచ్1బి వర్కర్లకు ఇది ఊరట కలిగించనుంది.హెచ్1బి అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా.అమెరికా కంపెనీలు విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుని పని చేయించుకునేందుకు ఈ వీసాలు వీలు కల్పిస్తాయన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube