హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆస్కార్ వేడుక జరగనుంది.పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ విజేతలను టాలీవుడ్ ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించనున్నారు.
ఈ మేరకు తెలుగు చిత్ర సీమ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ లను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకుంది.కాగా ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
కాగా ఇటీవల టాలీవుడ్ ఘనతను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఒరిజనల్ పాట కేటగిరీలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.







