పని చేయని ధమాకా సక్సెస్‌.. రావణాసుర పరిస్థితి అంతంత మాత్రమే

రవితేజ( Raviteja ) హీరోగా నటించిన ధమాకా చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన ఆ సినిమా తర్వాత వెంటనే రవితేజ హీరోగా నటించిన రావణాసుర( Ravanasura )చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులంతా కూడా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించారు.అయితే ధమాకా సినిమా సక్సెస్ రావణాసుర సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించబోతోంది అంటూ అంతా భావించారు.

 Raviteja Ravanasura Movie Collections,raviteja,ravanasura,dhamaka,tiger Nageswar-TeluguStop.com
Telugu Dhamaka, Ravanasura, Raviteja, Raviteja Fans, Tigernageswara-Movie

ధమాకా( Dhamaka ) సక్సెస్ వల్ల రావణాసుర ఓపెనింగ్స్ భారీగా పెరగడం ఆ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మరో 100 కోట్ల కలెక్షన్స్ నమోదు కావడం ఖాయం అంటూ రవితేజ అభిమానులు ధీమా వ్యక్తం చేశారు.తీరా చూస్తే సినిమా నిరాశ పరిచింది.కలెక్షన్స్ విషయంలో చాలా వెనుకంజలో ఉంది.100 కోట్ల కలెక్షన్స్ అని ఆశించిన చిత్ర యూనిట్ సభ్యులకు మరియు అభిమానులకు నిరాశ మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.కనీసం 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయితే గొప్ప విషయం అన్నట్లుగా ఇప్పుడు రావణాసుర కలెక్షన్స్ గురించి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Telugu Dhamaka, Ravanasura, Raviteja, Raviteja Fans, Tigernageswara-Movie

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా యొక్క కలెక్షన్స్ భారీగా నమోదు అవుతాయని, రవితేజ అభిమానులు భావించినప్పటికీ ఆ స్థాయిలో లేవనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.ధమాకా సినిమా సక్సెస్ కారణంగా భారీ ఎత్తున బిజినెస్ అయితే జరిగింది.కానీ ఆ స్థాయిలో కలెక్షన్స్ నమోదు కాలేదు.

నిర్మాతలు ముందుగానే సినిమా కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో లాభాలను సొంతం చేసుకున్నారు.కానీ నిర్మాతల వలన డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోవాల్సి వచ్చింది అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ సినిమా అనగానే మినిమం గ్యారంటీ అని ఒక అభిప్రాయం ఉంది.కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం దెబ్బతిన్నది అంటూ ఆయన అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందు ముందు అయినా రవితేజ నుండి రాబోతున్న టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) ఇంకా తదుపరి సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube