కన్నబిడ్డలనే చంపిన తల్లి.. అంత కష్టం ఏమొచ్చిందంటే..?

నవ మాసాలు మోసి కన్న ఓ తల్లి ( Mother )తన పిల్లలను తల, మొండెం వేరుచేసి చంపేసింది.ఈ వార్త స్థానికంగా అందరిని కలచివేసింది.

 A Mother Killed Her Own Children Crime News , Mother , Killed , Police , Child-TeluguStop.com

ఇంటివల్లే కాలంలో సమాజంలో ఇలాంటి వింత దారుణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.పిల్లలకు రక్షణ కల్పించాల్సిన తల్లిదండ్రులే, ఆ పిల్లలను అంతం చేస్తే ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు.

ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే ఉత్తర్ ప్రదేశ్( Uttar Pradesh ) లోని గాజీపూర్ జిల్లా లోని హమీర్ పుర్ బిజౌరా గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ అనే దంపతులు నివసిస్తున్నారు.

వీరికి ముగ్గురు పిల్లలు సంతానం.కుమార్తె పారీ కు 9ఏళ్లు, కుమారుడు హ్యాపీ కు 6ఏళ్లు, మరో కుమారుడు హార్దిక్ కు పది నెలల వయసు.అజిత్ యాదవ్ జమ్మూ లో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నాడు.శుక్రవారం రాత్రి గదిలో నిద్రిస్తున్న తన పిల్లలపై కనికరం లేకుండా నీతూ యాదవ్ దాడి చేసింది.

ఇద్దరూ పసిపిల్లల తల, మొండెం వేరు అయ్యేలా నరికేసింది.భయంతో కుమార్తె పారీ అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను కాపాడుకుంది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు( Police ) సంఘటన స్థలానికి వచ్చి చూస్తే ఇద్దరు పసివాళ్ళ తల, మొండం వేరుగా పడి ఉన్నాయి.

<i
mg src=” https://telugustop.com/wp-content/uploads/2023/04/mother-killed-Police-children-Ghazipur.jpg”/>

నీతూ యాదవ్ ను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించగా ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని.పైగా నాలుగు సంవత్సరాల నుండి చికిత్స తీసుకుంటున్నట్లు బయటపడిందని ఎస్పీ తెలిపారు.విచారణలో తానే తన పిల్లలను నరికి చంపానని నీతు యాదవ్ అంగీకరించింది.

జమ్ములో ఉన్న అజిత్ యాదవ్ కు సమాచారం అందించడంతో వెంటనే గాజీపుర్ వచ్చాడు.ప్రస్తుతం నీతు యాదవ్ పోలీసుల అదుపులో ఉంది.

స్థానికంగా ఈ ఘటన అందరిని కలచివేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube