మనిషి అత్యాశ, ఆకర్షణ లాంటి వాటికి లోనైతే తానేం చేస్తున్నాడో కూడా అసలు అర్థం కాదు.తొందరపాటుతో తనను తానే మోసం చేసుకున్నట్టే.
ఇటీవల కాలంలో మోసపోవడానికి.మోసం చేయడానికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు.
ఆన్లైన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన క్రమంలో అవతల వ్యక్తులను చాలా సులభంగా బురిడీ కొట్టించి కోట్లల్లో డబ్బులు కాజేస్తున్నారు.అలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఆన్లైన్లో డేటింగ్( Online dating ), చాటింగ్ అనేవి ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయాయి.తెలియని వారితో ఈ యాప్ లలో చాటింగ్ చేయడం ఒక రకంగా చాలా రిస్క్.
అవతల వ్యక్తుల ఆకర్షణలకు లోనైతే బురదలో కాలు వేసినట్టే.ఓ 55 ఏళ్ల వ్యక్తి కాస్త కక్కుర్తి పడి డేటింగ్ యాప్( A dating app ) ద్వారా అవతల వ్యక్తితో చాటింగ్ చేసి ఏకంగా రూ.14 కోట్లు పోగొట్టుకున్నాడు.

వివరాల్లోకెళితే ఇటలీకి చెందిన 55 ఏళ్ల వ్యక్తి హాంగ్కాంగ్( Hong Kong ) లో నివసిస్తున్నాడు.ఈ వ్యక్తికి టిండర్( Tinder ) లో ఓ యువతి పేరుతో ఓ వ్యక్తి చాటింగ్ చేయడం ప్రారంభించాడు.తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటూ చేసుకున్న పరిచయం వాట్సాప్ లో చాటింగ్ చేసే వరకు వచ్చింది.యువతి లాగా ఆ వ్యక్తికి ప్రతిరోజు మెసేజ్లు చేస్తూ కాస్త క్లోజ్ అయ్యాక ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని సలహా ఇవ్వడంతో 55 ఏళ్ల వ్యక్తి ఆ యాప్ లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు.ఫిబ్రవరి నెల వరకు భారత కరెన్సీలో రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టాడు.ఇక లాభాల సంగతి పక్కన పెడితే.పెట్టుబడి పెట్టిన అసలు కూడా వెనక్కి రాలేదు.మార్చి నెలలో 22 ట్రాన్సాక్షన్ల ద్వారా స్కామర్స్ డబ్బు మొత్తం ఖాళీ చేసేశారు.తాను మోసపోయానని గ్రహించిన వ్యక్తి చివరికి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు.
ఈ వార్త హాంగ్ కాంగ్ లో వైరల్ అవడంతో ముక్కు ముఖం తెలియని వ్యక్తుల వద్ద అన్ని కోట్లు ఎలా పెట్టుబడి పెట్టారని ఆశ్చర్యపోయారు.







