సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో( Business ) కూడా రాణిస్తూ దూసుకుపోతూ ఉంటారు.ఇప్పటికే చాలామంది హీరోలు సినిమాలలో నటించి అందులో వచ్చిన డబ్బులను బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి రాణిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం గొప్ప చరిత్ర సంస్కృతిని మారుపేరు.అంతే కాకుండా రుచికరమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి.
దాంతో చాలామంది సెలబ్రిటీలు ఆహార వ్యాపార రంగంలోకి ప్రవేశించారు.మరి ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

టాలీవుడ్ హీరో శర్వానంద్( Sharwanand ) గ్రామీణ నేపథ్యంతో కూడిన బీంజ్ కాఫీ షాప్ ని రన్ చేస్తున్నారు.అరటికాయ బజ్జి పునుగులు, మిర్చి బజ్జి వంటి తెలుగు స్నాక్స్ బాగా స్పెషల్ అని చెప్పవచ్చు.ఈ షాపు జూబ్లీహిల్స్ లో ఉంది.అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉలవచారు ఫ్రాంచైజీ దక్షిణ భారత వంటకాలను భోజన ప్రియులకీ అందిస్తున్నారు.ఇక హోటల్లోకి వెళ్ళగానే అక్కడ వాతావరణం మొత్తం అంతా కూడా ఇంట్లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.రెస్టారెంట్ గచ్చిబౌలి జూబ్లీహిల్స్ తో సహా హైదరాబాద్ చాలా అవుట్ లెట్ లను కలిగి ఉంది.

అలాగే శశాంక్ మాయాబజార్ అనే సినిమా నేపథ్యంలో రెస్టారెంట్ ని కొనసాగిస్తున్నారు.అందులో మేఘాలయ వంటకాలు కుటుంబ సభ్యులను ఆకర్షించే ఆకర్షనీయమైన ఇంటీరియర్స్ కు ప్రసిద్ధి.ఈ రెస్టారెంట్ సికింద్రాబాద్లోని ఖర్జానాలో ఉంది.డైరెక్టర్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ హైటెక్ సిటీ వైట్ ఫీల్డ్స్ లోని సర్క్యూట్ కి డ్రైవ్ ఇన్ కీ యజమాని.
ఈ రెస్టారెంట్ అద్భుతమైన రుచికరమైన వంటకాలను అందిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, భార్య నమ్రత ఆ ప్రముఖ హైదరాబాద్ ఫుడ్ చైన్స్ మినర్వా సహకారంతో ఏఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంది.విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్ ను 2020లో ప్రారంభించారు.
ఆ కేఫ్ ప్రశాంతమైన వాతావరణం రుచికరమైన కాపీ స్నాక్స్ కీ బాగా ప్రసిద్ధి.అలాగే హీరో దగ్గుపాటి రానా జూబ్లీహిల్స్ లో ఉన్న అభయారణ్యం కేవలం రెస్టారెంట్ మాత్రమే కాదు.
ఒక ఇల్లు కూడా.చిన్నప్పుడు ఆ ఇంట్లోనే నివసించారు హీరో రానా.
ఆ రెస్టారెంట్లో ఇటాలియన్ వంటకాలకు బాగా ప్రసిద్ధి.







