సోషల్ మీడియా యువతపైన ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే.ఇక్కడ చాలామంది పనిగట్టుకొని పాపులారిటీ కోసం నానా తంటాలు పడుతూ వుంటారు.
కొంతమందైతే పాపులారిటీ కోసం దేనికైనా దిగజారిపోతూ వుంటారు.ఈ క్రమంలో ఎన్నో దారుణాలు అనేవి జరుగుతూ ఉండడం మనం చూసాం.
ట్రైన్ ఎదురుగా వస్తున్నపుడు సెల్ఫీ వీడియో( Selfie video ) తీసుకోవడం కావచ్చు, సముద్రపు అల పైకి ఎగిరిగినపుడు వీడియో తీయాలని అనుకోవడం… డ్రైవింగ్ లో ఉంటుండగానే కావచ్చు… ఇలా కారణం ఏదైనా రిస్కు చేయడానికి మనోళ్లు వెనకడుగు వేయడంలేదు.
అయితే దురదృష్టవశాత్తు ఇలాంటప్పుడు చాలా మరణాలు సంభవిస్తున్నాయి.
అయినా యువతలో మార్పు రావడంలేదు.మరికొందరైతే బయటకు ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తున్నట్లుగా కటింగ్ ఇస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి.
ఫాలోవర్లను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కోసం కావచ్చు, యూట్యూబ్లో షార్ట్స్( Shorts on YouTube ) కోసం కావచ్చు… కొంతమంది ఏకంగా ఎక్కడ లేని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు.
ప్రస్తుతం ఇక్కడ కూడా అటువంటి సంఘటనే జరిగింది.కానీ కట్ చేస్తే సదరు యువతి చెంప చెల్లుమంది.

అవును, కోతికి( monkey ) అన్నం పెట్టేందుకు యత్నించిన యువతి చెంప చెల్లుమంది.కోతులు ఎప్పుడు ఎలా స్పందిస్తాయి అన్నది ఎవరికీ తెలియదు.వైరల్ అవుతోన్న వీడియోలో ఒక యువతి కోతికి అన్నం పెట్టేందుకు ట్రై చేస్తుండడం చూడవచ్చు.ఆ పక్కనే ఒక యువతి సెల్ ఫోన్ పట్టుకుని వీడియో కూడా తీస్తుంది.
అయితే రీల్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని, నిజంగా తన ఆకలి వారికి పట్టలేదని అర్ధం చేసుకున్న కోతి వెంటనే వచ్చి యువతి చెంప మీద ఒక్కటిస్తుంది.దీంతో ఒకసారిగా భయపడిపోయిన యువతి అక్కడి నుంచి పారిపోయింది.
కాగా నెటిజన్లు ‘నటిస్తే ఇలాగే ఉంటుంది… తగిన శాస్తి జరిగింది’ అంటూ ఆమెని ట్రోల్ చేస్తున్నారు.







