ఎస్వీ కృష్ణారెడ్డి ( SV Krishna Reddy )గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు సాధించిన విజయాలు ఎంతో మనందరికీ తెలుసు…ఆయన తీసిన ప్రతి సినిమా కుటుంబ కథా చిత్రం అనే చెప్పాలి.అవన్నీ మంచి ప్రేక్షక ఆదరణ కూడా పొందాయి.
ఇక అసలు విషయానికి వస్తే ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, దానికి మూల్యం తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.దానికి ఎవరు అతీతులు కాదు అని కొందరు మనుషులని చూస్తే అర్థం అవుతుంది…అందులో సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా తన కెరీర్ లో రెండు పెద్ద తప్పులు చేశారు.

ఇప్పటికీ “వజ్రం సినిమా( Vajram movie ) కంటే ముందు నేను వేరే కథ సిద్ధం చేశాను.నాగార్జునకు అదే కథ చెప్పాను.నాగ్ కు కూడా బాగా నచ్చింది.ఓకే చెప్పారు.కానీ నిర్మాత నరసారెడ్డి( Narasa Reddy ) మాత్రం ఒప్పుకోలేదు.టేబుల్ ప్రాఫిట్ ఉంటే తప్ప నేను సినిమా చేయనన్నాడు.
దీంతో అతడి కోసం నేను, నాగార్జున బెండ్ అవ్వాల్సి వచ్చింది.కథ మార్చేశాం.
రైట్స్ కొనుక్కొని ఓ రీమేక్ సినిమా చేశాం.అదే నేను చేసిన మొట్టమొదటి తప్పు.
నా కెరీర్ లో పెద్ద తప్పు కూడా అదే…కెరీర్ లో చేసిన ఆ అతిపెద్ద తప్పు వల్ల ఎస్వీ కృష్ణారెడ్డిపై ఏకంగా చాలా పెద్ద రిమార్క్ పడింది.పెద్ద హీరోలను కృష్ణారెడ్డి హ్యాండిల్ చేయలేరనే అపవాదను ఎదుర్కొన్నారు.
అది నిజమే అంటున్నారు ఈ సీనియర్ దర్శకుడు.కేవలం ఆ అనుమానాలతోనే చిరంజీవి, వెంకటేష్ తనకు అవకాశాలివ్వలేదని బాధపడ్డారు.
అయితే కృష్ణ లాంటి పెద్ద హీరోతో తను సినిమా తీసి హిట్ కొట్టిన విషయాన్ని అప్పట్లో ఎవ్వరూ గుర్తించలేదన్నారాయన.

ఇక ఎస్వీ కృష్ణారెడ్డి తన కెరీర్ లో చేసిన రెండో అతి పెద్ద తప్పు, హీరోగా మారడం.తను హీరోగా మారి చాలా పెద్ద తప్పు చేశానంటున్నారు.కేవలం దర్శకత్వంపై దృష్టి పెట్టి ఉంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని, హీరోగా మారి తన కెరీర్, మనీషా ఫిలిమ్స్( Manisha Films ) కెరీర్ కు బ్రేకులేశానని బాధపడ్డారు.
ప్రస్తుతం ఈ దర్శకుడు, చాలా సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ అందుకున్నారు.ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తీశారు.ఎప్పట్లానే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం కృష్ణారెడ్డే చూసుకున్నారు.వీటికి అదనంగా ఈసారి డైలాగ్స్ కూడా అందించారు…అయితే కృష్ణారెడ్డి గారి సినిమా అప్పటికి ఇప్పటికీ మన కుటుంబం మొత్తం కలిసి చూసేలాగా ఉంటాయి…
.