సాధారణంగా ఎంతో టాలెంట్ ఉంటే తప్ప సెలబ్రిటీ స్టేటస్ ను అందుకోవడం సులువు కాదనే సంగతి తెలిసిందే.రాహుల్ సిప్లిగంజ్( Rahul Sipligunj ) తన టాలెంట్ తో ఈ స్థాయికి చేరుకున్నారనే సంగతి తెలిసిందే.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ యాంకర్ శివతో( Anchor Shiva ) మాట్లాడుతూ రాత్రిపూట నిద్ర రాకపోతే యాంకర్ శివ ఇంటర్వ్యూలను చూస్తానని చెప్పుకొచ్చారు.రాహుల్ అలా చెప్పడంతో అవాక్కవడం శివ వంతైంది.
కీరవాణి సార్ పిలిస్తే నాటు నాటు సాంగ్( Naatu Naatu Song ) పాడేసి వచ్చానని ఆ ట్రాక్ ఫైనల్ ట్రాక్ కాదని చెప్పడం జరిగిందని రాహుల్ అన్నారు.ఆ తర్వాత ఆర్.
ఆర్.ఆర్ కోసం ఈ సాంగ్ పాడానని తెలిసిందని ఆయన కామెంట్లు చేశారు.ఆస్కార్ వేదికపై పాడటం చిన్న విషయం కాదని ఆయన తెలిపారు.అక్కడ పాడటం చాలా పెద్ద టాస్క్ అని ఆయన చెప్పుకొచ్చారు.బిగ్ బాస్ షోలో లాస్ట్ మూడు వారాల్లో డెసిషన్స్ మారిపోతాయని ఆయన తెలిపారు.

బిగ్ బాస్ ట్రోఫీ అనేది ఒక గుర్తింపు మాత్రమేనని రాహుల్ సిప్లిగంజ్ పేర్కొన్నారు.రంగమార్తాండ సినిమాలో నటించడం గురించి రాహుల్ మాట్లాడుతూ కృష్ణవంశీ గారు ఆ పాత్రకు నేను సూట్ అవుతానని భావించి సెలెక్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు.ఆ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

మన స్థాయి మనం మరిచిపోకూడదని అందుకే చిన్న సినిమాల కోసం కూడా నేను పని చేస్తానని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.పునర్నవితో నార్మల్ గా టచ్ లో ఉన్నానని ఆయన తెలిపారు.ప్రస్తుతం ప్రాజెక్ట్స్ పై దృష్టి ఉందని లైఫ్ ఎక్కడికో మూవ్ ఆన్ అయిపోయిందని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







