టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలన్నారు.
30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని బండి సంజయ్ కోరారు.నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును డైవర్ట్ చేయడానికే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.
టెన్త్ పేపర్ లీక్ విషయంలోనూ సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు.ఎగ్జామ్ సెంటర్ లోకి ఫోన్ ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.
హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అన్న బండి సంజయ్ తెలుగు పేపర్ లీక్ పై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.వాట్సాప్ లో ఎవరో పేపర్ షేర్ చేస్తే తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
తాను చెప్పినవన్నీ నిజాలేనని దమ్ముంటే సీపీ రంగనాథ్ ప్రమాణం చేయాలన్నారు.అదేవిధంగా రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యలపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.







