'విరూపాక్ష' థియేట్రికల్ ట్రైలర్.. రిలీజ్ ఎప్పుడంటే?

మెగా ఫ్యామిలి నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఒకరు.మెగా మేనల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం చాలా కష్టపడుతున్నాడు.

 Sai Tej Virupaksha Trailer To Release Soon Details, Virupaksha, Virupaksha Trail-TeluguStop.com

మెగా హీరో (Mega Hero) అనే చట్రం నుండి బయటపడి తనకంటూ స్పెషల్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కోవాలని బాబు ఆరాట పడుతున్నాడు.

ఈ క్రమంలోనే సాయి తేజ్ లాంగ్ గ్యాప్ తీసుకుని నటించిన సినిమా ”విరూపాక్ష”(Virupaksha).

నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.అందుకు కారణం కూడా లేకపోలేదు.

ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు (Karthik Varma Dandu) తెరకెక్కిస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.మేకర్స్ కూడా భారీ నిర్మాణ విలువలతో ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమాలో సాయి తేజ్ కు జోడీగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ టీమ్ అంతా సినిమా విజయం మీద ధీమాగా ఉన్నారు.తాజాగా ఈ సినిమా లోని క్యారెక్టర్స్ ను ఇంట్రడక్షన్ చేస్తూ నిర్వహించిన ఈవెంట్ కు కూడా మంచి స్పందన వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.అతి త్వరలోనే ట్రైలర్ (Virupaksha Trailer) రిలీజ్ ఉంటుంది అని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.అయితే ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు.

మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే.ఏప్రిల్ 21న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.చూడాలి సుకుమార్ అసిస్టెంట్ సాయి తేజ్ కు మంచి హిట్ ఇస్తాడో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube