తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను హన్మకొండ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.ఈ క్రమంలో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఉదయం నుంచి తిప్పుతున్నారంటూ ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పేపర్ లీక్ కుట్ర బండి సంజయ్ దే అంటూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్ ను తీసుకొచ్చిన కాన్వాయ్ ను అడ్డుకున్నారని సమాచారం.అటు బీజేపీ లీగల్ టీం మెజిస్ట్రేట్ నివాసానికి చేరుకుంది.







