విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు కేటుగాళ్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు.తాజాగా ఇటువంటి ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని రాజంపేటలో సుమారు 11 మందిని మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఓ కన్సల్టెన్సీలో పని చేస్తున్న శ్వేతా రెడ్డి అనే మహిళ రూ.లక్ష ఇస్తే వర్క్ వీసా తెప్పిస్తానంటూ బురిడీ కొట్టించిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేసినట్లు సమాచారం.నెలలు గడిచినా వీసాలు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
శ్వేతారెడ్డిని పిలిచి విచారించగా సమయాన్ని కోరుతూ కాలం వెల్లదీస్తున్నారని, పోలీసులు సైతం ఏజెంట్ కే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.







