ఇటీవల కాలంలో ప్రేమ మోజులో పడి కుటుంబ సభ్యుల పైనే దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు మూర్ఖులు.కనీసం తల్లిదండ్రులు అనే కనికరం లేకుండా కేవలం తమ స్వార్థం కోసం చంపడానికైనా వెనుకాడడం లేదు.
ఓ 14 ఏళ్ల యువతి తన ప్రేమకు తల్లి అడ్డు చెప్పడంతో ఏకంగా కిరాయి గుండాలకు సుపారీ ఇచ్చి హత్య చేయించింది.
రష్యాలోని మాస్కో( Moscow, Russia )లో ఓ 14 ఏళ్ల యువతి, 15 ఏళ్ల బాలుడిని ప్రేమించింది.
ఈ విషయం యువతి తల్లికి తెలియడంతో, బుద్ధిగా చదువుకోకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావని గట్టిగా నిలదీసింది.తల్లి ఎన్నిసార్లు చెప్పినా యువతి మాత్రం తన ప్రవర్తనను మార్చుకోలేదు.
పైగా తన ప్రేమకు తల్లి ( mother )అడ్డుగా ఉంటుందని నిర్ణయించుకున్న యువతి, తన ప్రియుడితో సహా కన్నతల్లిని చంపేందుకు కిరాయి గూండాలను ఫర్మాయించింది.
కిరాయి గుండాలు ఆ యువతి తల్లిని దారుణంగా కొట్టి, గొంతు కోసి మృతుదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి మాస్కో సమీప ప్రాంతంలో పడేశారు.మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అనస్తాసియా( Anastasia ) గా గుర్తించి, ఈమె కుమార్తెను ప్రాథమిక విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చాయి.
తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉండడంతో ప్రియుడుతో కలిసి తల్లిని హత్య చేసేందుకు కిరాయి గుండాలకు భారత కరెన్సీలో 3,72,202 రూపాయలు ఇచ్చినట్లు అంగీకరించింది.
ఇద్దరు మైనర్లు( minors ) కలిసి కిరాయి గుండాలతో 38 ఏళ్ల అనస్తాసియా ను దారుణంగా హత్య చేశారని పోలీసుల విచారణలో వెల్లడైంది.ఆ యువకుడితో పాటు ఆ యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.ప్రేమ కోసం కన్నతల్లినే హత్య చేసిన సంఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.
ప్రేమ మోజూలో పడి చివరకు కటకటాల పాలు అయింది.