ప్రియదర్శి( Priyadarshi ).కావ్య కళ్యాణ్ రామ్( Kavya Kalyan Ram ) జంటగా రూపొందిన బలగం( Balagam ) సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
తెలంగాణ పల్లె సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి బలగం సినిమా లో అద్భుతంగా చూపించారు అంటూ ప్రశంసలు దక్కించుకున్న విషయం తెల్సిందే.వేణు దర్శకత్వం లో దిల్ రాజు( Dil Raju )నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ లో కూడా భారీ గా వసూళ్లు సొంతం చేసుకుంది.ఈ సినిమా యొక్క యూనిట్ సభ్యులను ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మోహన్ బాబు సన్మానించిన విషయం తెల్సిందే.
చిత్ర యూనిట్ సభ్యులను సన్మానించడం మరియు పొగడటం అనేది కాస్త చిన్న చూపు అన్నట్లుగా కొందరు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే కొందరు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు బలగం చిత్ర ఫలితం పై పెదవి విరుస్తున్నారు.
బలగం సినిమా విజయాన్ని వారు పట్టించుకోవడం లేదు.అందుకు కారణం తెలంగాణ నేపథ్యంలో సినిమా రూపొందిన కారణంగా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కొందరు బలగం సినిమా యొక్క సెక్సెస్ ను అభినందిస్తున్నారు.కానీ నేరు గా మాత్రం అతి తక్కువ మంది మాత్రమే బలగం యూనిట్ సభ్యులపై స్పందిస్తూ అభినందిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తెలంగాణ సినిమా అనే ఉద్దేశ్యంతో ఆ సినిమా ను కొందరు పట్టించుకోవడం లేదని.అందుకే కాకుండా దిల్ రాజు బ్యానర్ సినిమా అవ్వడం వల్ల పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
మొత్తానికి బలగం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరగకున్నా కూడా ఇతరులు చేస్తున్న సందడి కారణంగా ప్రచారం జరుగుతోంది.దిల్ రాజు వంటి కమర్షియల్ నిర్మాత ఈ చిన్న చిత్రాన్ని ఎలా చేసేందుకు వచ్చాడు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.