తెలంగాణలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.
బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు.







