తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) అరెస్టయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సంజయ్ ను పోలీసులు కరీంనగర్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు.
అయితే అరెస్టుకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.అసలు తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని, వారెంట్ చూపించాలని పోలీసులను సంజయ్ కోరినా, అవేవీ పట్టించుకోకుండానే అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.
అయితే పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు( Paper leakage case )లోనే ఆయనను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.బీఆర్ఎస్ కూడా ఇదే ప్రచారానికి దిగుతోంది.
సంజయ్ అరెస్టును అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారు.సంజయ్ ఇంటి ముందు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
అయితే ఆ సమయంలో పోలీసులు కూడా భారీగానే ఉన్నారు.అరెస్ట్ సమయంలో పోలీసులు బిజెపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
సంజయ్ అరెస్టును అడ్డుకునేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించినా, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.అయితే ఆయన అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకు వెళుతున్నారనేది కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు.

ఈ అరెస్టుపై బండి సంజయ్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.బీఆర్ఎస్ లో భయం నిజం.మొదటి నేను ప్రెస్ మీట్ పెట్టకుండా నన్ను అడ్డుకున్నారు.తర్వాత నన్ను అర్ధరాత్రి అరెస్టు చేశారు.తప్పులు చేస్తుందని దానిపై నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు.నన్ను జైలుకు పంపినా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపను అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
ఇక సంజయ్ అరెస్ట్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయట .రెండు రోజుల నుంచి జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో రెండు పేపర్లు పరీక్ష ప్రారంభమైన తర్వాత వెలుగులోకి రావడంతో, దీనికి కారణమైన ఉపాధ్యాయులను గుర్తించారు .వరంగల్ లో బయటకు వచ్చిన హిందీ పేపర్ విషయంలోనూ ఇదేవిధంగా ప్రచారం చేసి బండి సంజయ్ పై కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే టిఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
దీనిపై నిరుద్యోగుల్లోను బీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

అదేవిధంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతోందని, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కొద్ది రోజులుగా బిజెపి( BJP ) డిమాండ్ చేస్తూ ఉండడంతోనే, ఇదే వ్యవహారంలో సంజయ్ ను ఇరికించి అరెస్టు చేశారని ప్రచారం జరుగుతోంది.సంజయ్ అరెస్టు వ్యవహారంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.







