తెలంగాణ లో అధికార బీఆర్‌ఎస్ మరియు బీజేపీ మధ్య ఎన్నికలకు ముందే యుద్ద వాతావరణం నెలకొంది.రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఎన్నికల సమయంలో ఉంటుంది.కానీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బీఆర్‌ఎస్( BRS ) పార్టీని గత కొన్నాళ్లుగా బీజేపీ నాయకులు ప్రతి విషయంలో కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై మరియు సీఎం కేసీఆర్( cm kcr ) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) చేస్తున్న విమర్శలు మరియు ఆరోపణలు పతాక స్థాయికి చేరాయి.
ఈ సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ నాయకులపై ఎదురు దాడికి దిగుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు అర్హత సర్టిఫికెట్ లేకుండానే ఎన్నికల్లో పోటీ చేశారంటూ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సరైన విద్య కు సంబంధించిన సర్టిఫికెట్స్ ను కలిగి లేరని.అందుకే ఆయన ఆ సర్టిఫికెట్స్ ను బయటకు చూపడం లేదని వరుసగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఒక వైపు బీజేపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూనే మరో వైపు బీజేపీ నాయకులు( BJP leaders ) సర్టిఫికెట్ ఇష్యూను తెరపైకి తీసుకు రావడం అభినందనీయం అంటూ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నాయకులపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలతో వాతావరణం మరింత వేడి ఎక్కినట్లు అయింది.
ఈ ఏడాది చివర్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అనేది బీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య ఉంటుంది అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అనిపిస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.