లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఈ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఒక భారతీయ విద్యార్ధి.( UK Indian student ) క్యాంపస్‌లో ప్రబలంగా వున్న భారత వ్యతిరేకత, హిందూ ఫోబియా కారణంగా తాను దాడులకు గురైనట్లు ఆరోపించాడు.
బాధితుడిని హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన కరణ్ కటారియా (22)గా( Karan Kataria ) గుర్తించారు.తన భారతీయత, హిందూ గుర్తింపు కారణంగా ఎల్ఎస్ఈ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ పదవికి( LSE Student Union General Secretary ) పోటీ చేయడానికి తాను అనర్హుడిని అని అంటున్నారని కరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘంగా పోస్ట్ పెట్టాడు.అంతేకాకుండా తనపై దుష్ప్రచారాన్ని ప్రారంభించారని ఆరోపించాడు.
ఎల్ఎస్ఈ క్యాంపస్‌లో మాస్టర్స్ అభ్యసిస్తున్నాడు కటారియా. ఇతను తక్కువ వ్యవధిలోనే నేషనల్ యూనియన్ ఫర్ స్టూడెంట్స్‌కు ప్రతినిధిగా ఎన్నికయ్యారు.ఆ తర్వాత తన సహచరులు ఆయనను ఎల్ఎస్ఈ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీపడమని ఒత్తిడి చేశారు.దురదృష్టవశాత్తూ కొందరు వ్యక్తులు భారతీయ హిందువు ఎల్ఎస్ఈ స్టూడెంట్ యూనియన్‌కి నాయకత్వం వహించడాన్ని చూసి సహించలేకపోయారని కటారియా మండిపడ్డారు.
అన్ని దేశాలకు చెందిన విద్యార్ధుల నుంచి అపారమైన మద్ధతు లభించినప్పటికీ ఎల్ఎస్ఈ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను అనర్హుడినని ప్రకటించారని కరణ్ పేర్కొన్నారు.

అతను స్వలింగ సంపర్కుడని, ఇస్లామోఫోబిక్, క్వీర్‌ఫోబిక్, హిందూ నేషనలిస్ట్ అంటూ కరణ్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయి.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్ఎస్ఈఎస్‌యూ చెబుతోంది.దీనిపై కరణ్ స్పందిస్తూ.
తనపై ఈ ద్వేషపూరిత ప్రచారాన్ని చేసే వారిని గుర్తించి శిక్షించాల్సిందిపోయి.ఎల్ఎస్ఈఎస్‌యూ అప్రజాస్వామికంగా తన అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలింగ్ రోజున భారతీయ విద్యార్ధులను వారి జాతి, హిందూమతం ఆధారంగా బెదిరించారని కరణ్ ఆరోపించారు.

విద్యార్ధులు ఈ సమస్యను లేవనెత్తినప్పటికీ.ఎల్ఎస్ఈఎస్‌యూ దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.అయితే కటారియా మాత్రం తనకు మద్ధతుగా నిలవాలని ఎల్ఎస్ఈ నాయకత్వాన్ని కోరాడు.
విద్యార్ధుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఎల్ఎస్ఈలో దాదాపు 11,000 మంది విద్యార్ధులు సభ్యులుగా వున్నారు.
వీరిలో 60 శాతానికి పైగా మంది యూకేకు వెలుపల నుంచి వచ్చినవారే.
.






