జుట్టు అనేది ప్రతి అబ్బాయికి, అమ్మాయికి ఎంతో విలువైనది.అంతేకాకుండా జుట్టు( Hair ) మన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం అని చెప్పాలి.
జుట్టు సరిగా లేకపోతే వ్యక్తిత్వంపై చాలా ప్రభావం పడుతుంది.అందుకే తరచుగా చాలామంది జుట్టు రాలడం వలన బాధపడుతూ ఉంటారు.
జుట్టు రాలే సమస్యతో ఎన్నో షాంపూలు, నూనెలు వాడుతుంటారు.అయితే ఇలా చిన్న వయసులో నుంచే జుట్టు రాలడానికి కారణం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే.
జుట్టుకు శరీరం వంటి ఆహారం అవసరం ఉంటుంది.అయితే జుట్టుకు ఆహారంగా నూనె సహాయపడుతుంది.
సరైన సమయంలో జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది.అందుకే ప్రతిరోజు లేదా వారానికి రెండు, మూడు రోజులు జుట్టుకు కచ్చితంగా నూనె రాసుకుని మసాజ్ చేయాలి.
దీనివల్ల చుండ్రు జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.ఇక చాలామందికి నూనె రాసుకున్న తర్వాత కూడా జుట్టు రాలడం జరుగుతూ ఉంటుంది.
నూనె రాసుకునే విధానం తప్పు అయినప్పుడు ఇలా జరుగుతుంది.

అందుకే ఎక్కువసేపు జుట్టుకు నూనె( oil ) రాసుకుంటే జుట్టుకు పుష్కలంగా పోషణ లభిస్తుంది.ఇక చాలామంది రాత్రిపూట నూనె రాసుకుని ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తూ ఉంటారు.అయితే ఆయుర్వేద నిపుణుల( Ayurvedic experts ) అభిప్రాయం ప్రకారం నూనె జుట్టుకు సరైన సమయంలో మాత్రమే పుసుకోవాలి.
నూనెను 45 నుంచి 50 నిమిషాలు మాత్రమే తలకు ఉంచాలి.దీనికంటే ఎక్కువసేపు ఉంచడం వలన జుట్టు సమస్యలు వస్తాయి.జుట్టుపై ఒక గంట కంటే ఎక్కువ సేపు నూనెను ఉంచకూడదు.

జుట్టుపై ఎక్కువసేపు నూనె ఉంటే రంధ్రాలు మూసుకుపోతాయి.దీంతో జుట్టుకు ఆక్సిజన్ చేరకుండా ఉంటుంది.దీంతో నూనె ఎక్కువ సేపు ఉండడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.
తలలో దద్దుర్లు, మొటిమలు అలాగే జుట్టు రాలడం లాంటి సమస్యలు మొదలవుతాయి.ఇక నూనె పూసుకునే సమయంలో గట్టిగా రుద్దకుండా ఉండేలా చూసుకోవాలి.
ఇక రాత్రిపూట నూనె రాసుకోవడం చాలా మంచి విషయం.ఆ సమయంలో జుట్టుకు పోషణాలు లభిస్తాయి.







