సైబర్ వలలో చిక్కిన ఎరువుల సంస్థ ఎండి..రూ.6.6 కోట్లు స్వాహా..!

ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల(Cyber Crime ) ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.అవతల వ్యక్తులను మోసం చేయడానికి పక్కా ప్లాన్లు రచించి సులువుగా కోట్లల్లో డబ్బు స్వాహా చేసి మోసం చేసేస్తున్నారు.

 Fertilizer Company Md Caught Cheated By Cyber Crime Rs.6.6 Crore , Fertilizer-TeluguStop.com

ఇందుకోసం అవతల వ్యక్తుల వ్యక్తిత్వం, ఇతర వివరాలపై కొంత కాలం నిఘా పెట్టి మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాదులో ఏకంగా ఓ ఎరువుల సంస్థ ఎండి నుంచి రూ.6.6కోట్లు కుచ్చుటోపి వేశారు ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి ఓ రసాయనిక ఎరువుల సంస్థ ఎండి( Fertilizer company )గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అయితే ఎరువుల సంస్థ తరఫున సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా అనాధలు, స్వచ్ఛంద సంస్థలకు తమ వంతు సహాయం ప్రతి ఏటా అందిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో గత సంవత్సరం జూన్ నెలలో హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రి నుండి ఎరువుల సంస్థ ఎండికి ఫోన్ వచ్చింది.తాను హాస్పటల్ ప్రతినిధి అంటూ ఓ మహిళ తన మాటలతో ఎరువుల సంస్థ ఎండిని నమ్మించింది.

Telugu Cyber, Hyderabad, Latest Telugu, Organ-Latest News - Telugu

ఒకరికి అవయవ దానం ( Organ donation ) చేయాల్సి ఉందని, అవయవ దానం చేస్తే తప్ప ప్రాణాలు కాపాడడం కష్టం అని చెప్పడంతో ఎరువుల సంస్థ ఎండి నిజమే అని నమ్మి, ఫోన్ చేసిన మహిళ యొక్క బ్యాంకు ఖాతాలకు గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.6.69 కోట్లు పలుదాఫాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పంపించారు.

Telugu Cyber, Hyderabad, Latest Telugu, Organ-Latest News - Telugu

సీఎస్ఆర్ కింద వివరాలు నమోదు చేసేందుకు ఎండి ఆ మహిళకు ఫోన్ చేసి బిల్లులు, ఇతర వివరాలు పంపాలని చెప్పడంతో అవతల నుండి ఎటువంటి సమాధానం లేదు.దీంతో కాస్త గట్టిగా అడగగా ఎండి ఫోన్ కు అసభ్యకర చిత్రాలు, అసభ్యకర సందేశాలు రావడం మొదలయ్యాయి.ఇంకోసారి ఫోన్ చేసి వివరాలు అడిగితే ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో తాను మోసపోయిన విషయం గ్రహించిన ఎండి చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube