వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్... టెక్ట్స్‌ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు!

ప్రముఖ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( Whatsapp ) మంచి స్పీడుమీద వుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ తన వినియోగదారులకు ఫుల్ జోష్ ఇస్తోంది.

 Another New Feature In Whatsapp Texts Can Be Used However You Want , Voice Note,-TeluguStop.com

ఇప్పటికే వాయిస్ నోట్( Voice note ), తేదీతో చాట్ సెర్చ్, పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్( Chat search, picture in picture mode ) వంటి అత్యాధునిక ఫీచర్లను అందించిన వాట్సాప్ ఇప్పుడు మరింత అడ్వాన్స్ డ్ ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది.కాగా ప్రస్తుతం దానికి సంబంధించిన పరీక్షలు కూడా వేగంగా నిర్వహిస్తోంది.

త్వరలో టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ ఓ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది.దీనిలో ఫొటోలు, వీడియోలు, గిఫ్ లను ఎడిట్ చేయడానికి వీలుపడుతుంది.

Telugu Chat Search, Latest, Picturepicture, Ups, Whatsapp, Whatsapp Text-Latest

వాట్సాప్ బీటా ఇన్ ఫో రిపోర్టు ఏం చెబుతుందంటే… టెక్ట్స్ ఎడిటర్ లోని ఫాంట్ చేంజ్ ఆప్షన్ తో, యూజర్ కీబోర్డులో తనకు నచ్చిన ఫాంట్ ను ఎంచుకుని టెక్ట్స్ లో మార్పులు చేసుకోవచ్చని అంటోంది.ఫొటో, వీడియో, గిఫ్ లపై టెక్ట్స్ రాసేటప్పుడు ఈ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టెక్ట్స్ అలైన్మెంట్ ఫీచర్ తో యూజర్ తనకు నచ్చిన వైపు దాన్ని మార్చుకోవచ్చు.అంటే ఇక్కడ కుడి, ఎడమ, సెంటర్ వైపులకు పెట్టుకోవచ్చన్నమాట.టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ తో మొత్తం టెక్ట్స్ లో మీకు హైలెట్ అవ్వాలనుకునే ముఖ్యమైన భాగాన్ని ప్రత్యేకంగా కనిపించేలా మార్పులు చేయొచ్చు.

Telugu Chat Search, Latest, Picturepicture, Ups, Whatsapp, Whatsapp Text-Latest

అంతేకాకుండా, మీకు నచ్చిన రంగు లేదా ఫొటోను ఇక్కడ టెక్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు.అలాగే కొన్ని కొత్త ఫాంట్లపై కూడా వాట్సాప్ ఈ అప్ డేట్ లో ఇవ్వనుంది.కొరియర్ ప్రైమ్, కాలిస్టోగా, డామియన్ ఎక్సో 2, మార్నింగ్ బ్రీజ్ వంటి ఫాంట్లు బీటా యూజర్లకు అందుబాటులో ఉంది.

అలాగే మార్చిలో ప్రచురితమైన కొన్ని రిపోర్టుల ప్రకారం వాట్సాప్ ఆడియో చాట్స్ అనే కొత్త ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు భోగట్టా.అలాగే యూజర్లు వాట్సాప్ పంపే ఫొటోలను ఒరిజనల్ సైజ్ లో పంపేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకు రానుంది.

దీంతో యూజర్ వాట్సాప్ ద్వారా ఫొటోను ఇతరులకు షేర్ చేసినప్పుడు కూడా వాటి క్వాలిటీలో ఎలాంటి మార్పులు వుండవు.ఒరిజినల్ రిజల్యూషన్ పాడవకుండా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube