బాక్సాఫీస్ పై దండయాత్ర కంటిన్యూ.. 100 కోట్ల చేరువలో 'దసరా'.. ఈ రోజు గడిస్తే..

నాచురల్ స్టార్ నాని (Nani) టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు.టైర్ 2 హీరోల్లో ఒకరైన నాని ఇప్పుడు మరో మెట్టు ఎక్కబోతున్నాడు.

 Dasara Box Office Collection Day 4 Details, Dasara Box Office Collections, Dasar-TeluguStop.com

ఎందుకంటే నాని తాజాగా నటించిన ‘దసరా’ (Dasara) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సైతం అందుకుంటుంది.

నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమాతో నాని చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ మీద తన పరిధిని మించి దండయాత్ర చేస్తున్నాడు.

కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.స్టార్ హీరోల సినిమాలకు వస్తున్న రేంజ్ లో నాని దసరా సినిమాకు కలెక్షన్స్ (Dasara Collections) రావడం అందరిని ఆశ్చర్య పరచడమే కాదు.నాని మరో మెట్టు ఎక్కాడు అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది.అలాగే రెండు రోజుల్లోనే ఏకంగా 50 కోట్లు క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఇక ఇప్పుడు నాలుగు రోజుల్లోనే 87 కోట్ల రూపాయలను రాబట్టి 100 కోట్లకు మరింత చేరువ అయ్యింది.ఈ స్పీడ్ చూస్తుంటే ఈ రోజు కానీ రేపు కానీ 100 కోట్ల మార్క్ టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.చూడాలి ఈ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని 100 కోట్ల మార్క్ ను టచ్ చేస్తాడా లేదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube