టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం... నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్యకాలంలో ఎంతోమంది నటీనటులను కోల్పోతున్నటువంటి చిత్ర పరిశ్రమ తాజాగా మరొక నటుడు, నిర్మాతను కోల్పోయింది.

 Tragedy In Tollywood Industry Actor Costume Krishna Passed Away Details, Costume-TeluguStop.com

కెరియర్ మొదట్లో కాస్ట్యూమర్ గా ఇండస్ట్రీకి సేవలు అందించిన కాస్ట్యూమ్ కృష్ణ(Costume Krishna) అనంతరం నటుడిగా దర్శకుడిగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు.ఇక ఈయన నిర్మాతగా కూడా ఇండస్ట్రీకి ఎన్నో సేవలను అందించారు.

ఇక తెలుగులో పెళ్లి పందిరి సినిమాతో సహా ఏకంగా ఎనిమిది సినిమాలకు నిర్మాతగా(Producer) వ్యవహరించారు.కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్(Bharath Bandh) అనే సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ నేడు చెన్నైలోని ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఈయన ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు.అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పలుమార్లు చికిత్స తీసుకుంటూ ఉన్నారు.ఈ మధ్యనే కోలుకున్నటువంటి ఆయన తిరిగి ఇంటికి చేరుకున్నారు.అయితే నేడు ఆయన స్వగృహంలోనే కన్నుమూశారు.

కాస్ట్యూమ్స్ కృష్ణ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన నటించిన సినిమాలలో ఈయన పాత్రకు ఎంతో మంచి గుర్తింపు వచ్చింది ఈయన ఎక్కువగా విలన్ పాత్రలలోనూ కన్నింగ్ పాత్రలలోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.పెళ్ళాం చెపితే వినాలి, దేవుళ్ళు, దొంగ మెగుడు, అల్లరి మెగుడు, పెళ్ళి పందిరి, పుట్టింటి రా చెల్లి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.విజయ నగరం జిల్లా లక్కవరపు కోటలో జన్మించిన ఈయన కాస్ట్యూమర్ గా ఇండస్ట్రీకి పరిచయమై చెన్నై చేరుకున్నారు.

ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసిన కృష్ణ మరణించారనే వార్త తెలియగానే పలువురు సినీ సెలబ్రిటీలు ఈయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube