ఐపీఎల్ టోర్నీలో రెండో రోజు పంజాబ్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్( Punjab) విజయం సాధించింది.మొదట టాస్ గెలిచి కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.
దీంతో మొదటి బ్యాటింగ్ దిగిన పంజాబ్ 20 ఓవర్ లలో ఐదు వికెట్లు నష్టానికి 191 పరుగులు చేయడం జరిగింది.పంజాబ్ టీంలో భానుక రాజపక్స అర్థ సెంచరీతో పాటు ధావన్ 40, సామ్ కరన్ 26*, సిమ్రాన్ సింగ్ 23, జితేష్ 21 పరుగులు చేయడం జరిగింది.
191 పరుగుల లక్ష్యంతో రెండో బ్యాటింగ్ దిగిన కోల్ కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders ) 16 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేయడం జరిగింది.16 ఓవర్లు కాగానే జోరు వాన కురిసింది.దీంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపేశారు.కోల్ కతా నైట్ రైడర్స్ 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉండగా.అయినా గాని వర్షం తగ్గకపోవటంతో…డక్ వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్ గెలిచినట్లు ఎంపైర్లు ప్రకటించారు.మ్యాచ్ తిరిగి నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.