హైదరాబాద్ లో డేటా చోరీ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు.హర్యానా ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో 66.9 కోట్ల మందికి సంబంధించిన వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రెండు ల్యాప్ టాపులు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 24 రాష్ట్రాలకు చెందిన డేటా విక్రయించినట్లు గుర్తించారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు మొత్తం 104 విభాగాలకు చెందిన వ్యక్తుల, సంస్థల డేటాను విక్రయించినట్లు నిర్ధారించారు.
అంతేకాకుండా జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్ ప్లిక్స్ నుంచి కూడా డేటా సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.