ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్( Elon Musk ) గురించి తెలియనివారు దాదాపుగా వుండరు.ఇతగాడు గతేడాది 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్( Twitter)ను కొనుగోలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక మనోడు ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన తరువాత చేలా ప్రయోగాలు చేసాడు.దాంతో పలు వివాదాలు కూడా మూటగట్టుకున్నాడు.
మరీ ముఖ్యంగా మస్క్ చేసిన చేంజెస్ చూసి వినియోగదారులు సైతం పెదవి విరుస్తున్నారు.ఈ క్రమంలో చాలామంది ట్విట్టర్ నుండి బయటకు వచ్చేసిన పరిస్థితి.

ఇక అసలు విషయంలోకి వెళితే… తాజాగా ట్విట్టర్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా అవతరించారు.నిన్న మొన్నటి వరకు ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ( Barack Obama )మీద రికార్డు ఉండేది.అయితే అయితే ఎలాన్‌మస్క్ ఒబామాను అధిగమించి ప్రస్తుతం టాప్ ప్లేస్‌లోకి వెళ్లారు.
ప్రస్తుతం ఎలాన్ మస్క్‌కు ట్విట్టర్‌లో 13,30,68,709 మంది ఫాలోవర్స్ ఉండడం గమనార్హం.అదే ఒబామాకు అయితే 13,30,42,819 మంది ఫాలోవర్స్ ఉన్నారు.

ఇకపోతే ఎలాన్ మస్క్, గత జూన్‌లో 100 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్ మార్క్‌ను చేరుకోగా తరువాత ట్విట్టర్‌ను టేకోవర్ చేయడంతో అతని ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది.ఒబామా సామాజికంగా కీలకమైన విషయాలను, యూఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో జరిగిన ముఖ్యమైన విషయాలను మాత్రమే ట్వీట్ చేస్తూ వుంటారు.అయితే ఎలాన్ మస్క్ దానికి భిన్నంగా ప్రపంచంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి విషయంపై స్పందిస్తుంటారు.వాటిపై తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో వెల్లడిస్తుంటారు.ఈ కారణంగానే మస్క్ ట్విట్టర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా అవతరించినట్టు తెలుస్తోంది.







