టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది.టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్లను ప్రశ్నించాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్ మెంట్ రికార్డ్ చేయనుంది.బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏ రమేశ్ స్టేట్ మెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రమేశ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న సిట్ విచారణ చేస్తోంది.