తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.
అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కూడా దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

ఇప్పటికే ఆహాలో ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో( Unstoppable with NBK show )కు హోస్ట్ గా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.ఈ షో ద్వారా బాలయ్య బాబు తనలో ఉన్న మరొక టాలెంట్ ని బయటపెట్టారు.ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్( Kajal ) హీరోయిన్గా నటిస్తుండగా శ్రీ లీల బాలయ్య బాబు కూతురుగా నటిస్తోంది.అలాగే ఇందులో జగపతిబాబు కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.

దీంతో బాలయ్య బాబు అనిల్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా డేట్ పై ఇప్పటికే అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమా డేట్ ని ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 21 శనివారం వచ్చింది.ఆ తర్వాత రోజు నుంచి వరుసగా పండుగ సెలవులు.
అంటే దసరా సెలవులు.కాబట్టి ముందు రోజు బోయపాటి సినిమా విడుదల అయినప్పటికీ సమస్య కాదని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
ఇక ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 21 న విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.కాగా బాలయ్య బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దసరా పండుగకు ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.







