సోషల్ మీడియాలో( Social Media ) అను నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.ఆ వీడియోలో కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
మరికొన్ని మన కళ్ళను మనమే నమ్మలేనంత అద్భుతంగా ఉంటాయి.అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
సాధారణంగా అడవిలో హైనాలు ( Hyenas ) చాలా ప్రమాదకరం అని అందరికీ తెలుసు.వీటి దవడలు చాలా పెద్దగా ఉంటాయి.
ఇవి కొరికితే మొసలి శరీరమైనా ఊడి రావాల్సిందే.కుక్కల వలె ఉండే ఈ హైనాలు సింహాలను కూడా భయపెట్టిస్తాయి.

అలాంటి భయంకరమైన హైనాలు మనుషులను చూస్తే ఊరుకుంటాయా? అసలు మనుషులు వాటి దగ్గరకు వెళ్లే ధైర్యమైనా చేస్తారా? అసలు ఆ ఆలోచనే చాలా భయంకరంగా ఉంటుంది.కానీ, ఓ మహిళ ( Woman ) ఏమాత్రం భయం లేకుండా వందలాది హైనాలు తిరుగుతున్న అడవి మధ్య నుంచి నడుచుకుంటూ వెళ్లింది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఒక మహిళ నెత్తిమీద నీటి కుండ పెట్టుకొని, చేతిలో ఒక క్యాన్ పట్టుకుని చీకట్లో నడుచుకుంటూ వెళ్తోంది.
అయితే ఆమె వెళ్లే అటవీ మార్గంలో కృూర మృగాలు సంచరిస్తుంటాయి.

ఈ క్రమంలోనే ఆమె వెళ్తుండగా, దారిపొడగునా అత్యంత భయానకమైన, ప్రాణాంతకమైన హైనాలు నిలబడి ఉన్నాయి.అయితే, వందలాది హైనాలు నిలబడి ఉన్నా, ఆమె ఏమాత్రం భయం లేకుండా చాలా ధైర్యంగా అలానే ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది.ఆమె అలా వెళ్తుంటే హైనాలు చూస్తూ నిల్చున్నాయి కానీ ఆమెని ఏమీ చెయ్యలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియో చూసినా చాలా మంది ఆ మహిళను చూసి ‘అచ్చంగా ఆదిపరాశక్తి నడుచుకుంటూ వెళ్తున్నట్లే ఉందంటూ’ కామెంట్స్ పెడుతున్నారు.







