ఓటిటి( OTT ) వచ్చిన తర్వాత సినిమాని థియేటర్లో చూడాలని కోరిక ప్రేక్షకులకు తగ్గిపోతుంది.చాలా మట్టుకు సినిమాలు ఓటీటి లోనే చూడాలని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు.
థియేటర్లో టికెట్లు డబ్బులు పెట్టి మధ్యలో అడ్డగోలు ఖర్చు పెట్టి ఏవో తింటూ చూసే బదులు సకల సదుపాయాలతో ఫోన్లో చూడడం చాలా బెటర్ కదా.అందుకే నాలుగు రోజులు ఆగితే ఫోన్లో చూడొచ్చులే అనుకుంటూ మొత్తానికి థియేటర్ వైపు ఎవ్వరూ వెళ్లడం లేదు.కొన్ని సినిమాలు ఏమో మంచి టాక్ రావడంతో కొంతమేర ప్రేక్షకులు ఇల్లు కదిలి వెళుతున్నారు.అయితే అదే సినిమా ఓటీటి లో చూడాలంటే నచ్చడం లేదు.ఇక కొన్ని సినిమాలు ఏమో థియేటర్ లో మంచి టాక్ వచ్చినా కలెక్షన్స్ రాకపోవడంతో, ఆ తర్వాత ఓటీటి లో విడుదల చేస్తే కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

అందుకు చక్కటి ఉదాహరణ చెప్పాల్సి వస్తే బలగం సినిమా( Balagam ).సినిమా బాగుంది అని చాలామంది మొదటి రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు.అయినా కూడా ఇల్లు విడిచి కాలు బయట పెట్టడానికి ప్రేక్షకుడికి మనసు ఒప్పలేదు.
ఈ సినిమా కచ్చితంగా ఓటిటిలో విడుదలయ్యాక చూడాల్సిందే అంటూ థియేటర్లన్నీ కూడా కాలిగా వదిలేయాల్సిన పరిస్థితి.అయితే అందరూ ఊహించినట్టుగానే సినిమా ఓటిటిలో విడుదలవగానే ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటూ ప్రతి ఇంటిలో కూడా అదే మాట వినిపిస్తుంది.
తెలంగాణలో ప్రతి పల్లెలో ప్రస్తుతం ఈ సినిమా గురించి ఏదో ముచ్చట నడుస్తోంది.ఎవరిని కదిలించినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.

బలగం సినిమా ప్రభావం ఇంత ఎత్తున ఉంటే జాతి రత్నాలు( jathi rathnalu ) సినిమా థియేటర్ లో కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది కానీ ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తే చూసిన నాథుడే లేడు.కామెడీ సినిమాగా విడుదలై ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ సినిమా ఓటిటి లో మాత్రం ఫ్లాప్ అని చెప్పొచ్చు.అది చూస్తున్నంత సేపు రోత కామెడీ అని అనిపించకుండా మానదు.కానీ బలగం సినిమా చూసి ప్రతి ఆడపడుచు కన్నీళ్లు పెడుతుంది.ఇదే జాతి రత్నాలు బలగం సినిమాకి ఉన్న ఓటీటి తేడాలు.







