నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వయస్సు పెరుగుతున్నా అదే సమయంలో ఆయన సినిమాల సక్సెస్ రేట్ సైతం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.బాలయ్య సినీ కెరీర్ గురించి ఎవరైనా మాట్లాడుకోవాలంటే అఖండ ముందు అఖండ తర్వాత అని మాట్లాడుకోవాల్సి వస్తోంది.
సరైన ప్రాజెక్ట్ లను, డైరెక్టర్లను ఎంచుకుంటే బాలయ్య సక్సెస్ రేట్ సైతం ఊహించని రేంజ్ లో పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బాలయ్య చిన్న కూతురు తేజస్విని( Tejaswini ) బాలయ్య కెరీర్ కు సంబంధించి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
బాలయ్య చిన్నల్లుడు భరత్ ( Bharath ) ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.తేజస్వినితో పెళ్లి గురించి భరత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
బ్రాహ్మణి, తేజస్విని నాకు చిన్నప్పటి నుంచి తెలుసని భరత్ అన్నారు.

మా అత్తమ్మ వసుంధర, మా అమ్మ ఒకే స్కూల్ లో చదివారని ఆయన తెలిపారు.ప్రతి నెలా వీళ్లు కలిసేవారని ఆయన పేర్కొన్నారు.బ్రాహ్మణితో ఎక్కువ పరిచయం ఉండేదని భరత్ చెప్పుకొచ్చారు.
నేను చదువుకోవడానికి అమెరికాకు వెళ్లానని ఆయన తెలిపారు.నా పెళ్లి ప్రస్తావన వచ్చిన సమయంలో మా పెద్దమ్మ రెండు కుటుంబాలతో మాట్లాడి పెళ్లి సెట్ చేశారని భరత్ పేర్కొన్నారు.

23 ఏళ్ల వయస్సులో పెళ్లి జరిగిందని ఆయన తెలిపారు.బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం ఫ్రీగా మాట్లాడతారని భరత్ చెప్పుకొచ్చారు.నేను ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో తేజస్విని సపోర్టివ్ గా ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు.నా భార్యకు రాజకీయాలు నచ్చవని భరత్ చెప్పుకొచ్చారు.భరత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.2024 ఎన్నికల్లో పోటీ చేయాలని భరత్ భావిస్తుండగా ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.







