మూడేళ్ల క్రితం సెక్యూరిటీ ఆఫీసర్ మరణానికి దారితీసిన కేసుకు సంబంధించి భారత సంతతికి చెందిన వ్యక్తిపై సింగపూర్‌లో అభియోగాలు మోపారు.నిందితుడిని 60 ఏళ్ల సురేశ్ కుమార్( Suresh Kumar ) షణ్ముగంగా గుర్తించారు.
ఇతను వన్ రాఫెల్స్ ప్లేస్‌లో ఫ్రీలాన్స్ ఫేడ్ క్లినింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.సురేష్‌ను మంగళవారం వర్క్ ప్లేస్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు.
ఇతను కొన్ని ఫ్లోర్ స్లాబ్‌లను పునరుద్దరించడంలో విఫలమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అంతేకాకుండా మరికొందరు కార్మికులతో కలిసి భవనంలోని 63వ అంతస్తులో స్లాబ్‌ను ఇతను తొలగించినట్లుగా తెలుస్తోంది.
అయితే 2019లో ఆ భవనానికి సమీపంలోని 4 మీటర్ల లోతున్న గోతిలో పడి షాన్ తుంగ్ మున్ హాన్ అనే సెక్యూరిటీ ఆఫీసర్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.ఘటనాస్థలికి చేరుకున్న పారామెడిక్స్ అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు.
2020లో జరిగిన విచారణ సందర్భంగా.ఫ్లోర్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే సెక్యూరిటీ ఆఫీసర్ ప్రమాదానికి గురయ్యాడని తేలింది.
అలాగే బిల్డింగ్ ముందు భాగంలో క్లినింగ్ చేసే కార్మికులు.తుంగ్ పడిపోయిన గోతిని కప్పకుండా వదిలేశారని కోర్టు దృష్టికి వచ్చింది.
ఈ దుర్ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు సంస్థలు, ముగ్గురు వ్యక్తులను మార్చి 2020లో కోర్టు ఎదుట హాజరుపరిచారు ప్రాసిక్యూటర్లు.ఈ క్రమంలో షణ్ముగం కేసును కోర్ట్ ఏప్రిల్ 18న విచారించనుంది.

ఇదిలావుండగా.ఈ నెల ప్రారంభంలో మహిళా విద్యార్ధినిని లైంగికంగా వేధించినందుకు గాను సింగపూర్‌లో( Singapore ) భారతీయుడికి న్యాయస్థానం 4,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.నిందితుడిని కుమార్ అమృత్‌గా గుర్తించారు.డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టాన్ జింగ్ మిన్( Tan Jing Min ) ఏప్రిల్ 2022లో కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.
టెలోక్ అయర్ స్ట్రీట్‌లోని ట్రస్ట్ యోగాలో బాధితురాలు ఓ ప్యాకేజ్ కొనుగోలు చేశారు.ఈ క్రమంలో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా వున్న కుమార్ బాధితురాలి వీపును ఆమె అనుమతి లేకుండా తాకడమే కాకుండా బలవంతం చేసినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.

యోగా సమయంలో బాధితురాలిని ఒక భంగిమ నుంచి మరొక భంగిమకు మార్చే క్రమంలో కుమార్ మౌఖిక( Kumar moukhika ) సూచనలను మాత్రమే ఇచ్చాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్ చేయమని ఆమెకు చెప్పే ముందు కనీస హెచ్చరికలు లేకుండా బాధితురాలి పొజిషన్ మార్చాడని సదరు పత్రాల్లో ప్రస్తావించారు.ఊహించని ఈ సంఘటనకు షాకైన బాధితురాలు.మీ చేతులు దూరంగా వుంచాలని కుమార్‌ను హెచ్చరించింది.ఆ తర్వాత రోజే ఆమె పోలీసులను ఆశ్రయించింది.







