ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నాచురల్ స్టార్ నాని( Nani ) అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు.ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి నాని తాజాగా దసరా( Dasara ) సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఇక ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా నాని కెరియర్( Nani’s career) లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కడమే కాకుండా ఈ సినిమా కోసం నాని భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా నాని కెరియర్ లోనే అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున థియేటర్లను కేటాయించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందనే విషయానికి వస్తే.

దసరా సినిమా ప్రపంచవ్యాప్తంగా 2710 థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.నైజాంలో ఏరియాలో 290+ థియేటర్స్‌లో విడుదలవుతోంది.ఇక సీడెడ్ 190లో, ఆంధ్రా 410.మొత్తంగా ఏపీ తెలంగాణలో 900 థియేటర్స్‌లో విడుదలవుతోంది.ఇక ఈ సినిమా ఇతర భాషలలోకి కూడా విడుదల కాబోతుంది.
కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100, హిందీ, రెస్టాఫ్ ఇండియాలో 750 థియేటర్స్‌లో విడుదలకానుంది.ఇక ఓవర్సీస్‌లో 800 థియేటర్స్.ఇలా ప్రపంచవ్యాప్తంగా 2710 థియేటర్స్‌లో విడుదలకు సిద్దమవుతోంది.ఏది ఏమైనా నాని సినీ కెరియర్ లోనే దసరా సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
మరి ఈ సినిమా ద్వారా నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.







