రహదారులపై ప్రయాణించే వారు ఒక్కోసారి అలసిపోతుంటారు.సుదూర ప్రాంతాలకు వెళ్లే క్రమంలో మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలని భావిస్తారు.
దగ్గర్లో ఏదైనా హోటల్ ( Hotel ) కనిపిస్తే రూమ్ తీసుకుని సేదదీరుతారు.అయితే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగర శివారులోని ఇలా ఎవరైనా ప్రయాణిస్తూ షాక్‌కు గురవుతున్నారు.
ఎందుకంటే రోడ్డు పక్కనే ఓ హోటల్ మిరుమిట్లు గొలిపేలా లైట్లతో కనిపిస్తుంది.తీరా దగ్గరకెళ్తే అక్కడ ఏ హోటల్ ఉండడం లేదు.
కేవలం ఓ బోర్డు మాత్రమే అక్కడ దర్శనం ఇస్తోంది.ఇలా చాలా మంది కంగుతింటున్నారు.
దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాలిలా ఉన్నాయి.

ఏదైనా ప్రాంతంలో ఆసక్తికర విషయాలు ఉంటే వాటికి ఎక్కడా లేని ప్రాధాన్యత ఉంటుంది.పర్యాటకులు కూడా వెళ్లి ఆ ప్రాంతాలను సందర్శిస్తుంటారు.ఇలాంటి వారిని ఆకర్షించేందుకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ లో( Melbourne ) ఓ వింత హోటల్ ఉంది.
అది రాత్రి సమయంలో భారీ బిల్డింగ్‌లా కనిపిస్తుంది.ఆ హోటల్ లో కొందరు కస్టమర్లు ఉన్నట్లు కనిపించేలా కొన్ని గదుల్లో లైట్లు వెలుగుతున్నట్లు కూడా అనిపిస్తుంది.
చాలా ఆకర్షణీయంగా రోడ్డు పక్కనే ఇది ఉంటుంది.ఇదే ప్రాంతంలో చాలా మంది వాహనాలలో ప్రయాణిస్తూ ఈ హోటల్ కనిపించగానే ఆగుతున్నారు.

విశ్రాంతి తీసుకుందామని భావించి భంగపడుతున్నారు.ఎందుకంటే అక్కడ ఎలాంటి హోటల్ ఉండదు.అది ఎలాంటి గదులూ లేని ఓ భవనం మాత్రమే.ఇదొక ఉత్తుత్తి హోటల్.దీని నిర్మాణం కోసం రూ.6.6 కోట్లకు పైగా వెచ్చించారు.కెనడాకు చెందిన ఆర్టిస్ట్ క్యాలమ్ మోర్టాన్ దీనిని రూపొందించారు.
కేవలం అటుగా వెళ్లే వారిని ఆకర్షించడం కోసమే దీనిని రూపొందించారు.మనకు కొన్ని సినిమా సెట్లలో కనిపించే బిల్డింగ్‌ల మాదిరిగానే ఇది ఉంటుంది.
దీని దగ్గరకెళ్లి మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.అయితే దీనిని క్రియేటివిటీతో ( Creativity ) తయారు చేశారని ప్రశంసిస్తున్నారు.







