40 మంది వైసీపీ వాళ్లు రెడీగా ఉన్నారు అంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ( TDP ) పుంజుకుంది.

దీంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.తెలుగుదేశం పార్టీలోకి చాలామంది వైసీపీ నాయకులు వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు తెగ ప్రచారం జరుగుతూ ఉంది.

ఇటీవలే వైసిపి నుండి సస్పెండ్ అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotam Reddy Sridhar Reddy ) తమ్ముడు గిరిధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది.ఇంకా సస్పెండ్ అయిన నలుగురు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి తరుణంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు( Achchennaidu ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారంటూ వస్తున్న ఆరోపణలపై వైసీపీ పై మండిపడ్డారు.వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు తమని సంప్రదించలేదని స్పష్టం చేశారు.

Advertisement

ఇక ఇదే సమయంలో.వైసీపీ నుండి 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వస్తామని అంటున్నట్లు.

అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.పోలీట్ బ్యూరో సమావేశం అనంతరం అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అంతేకాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకి పార్టీ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు.ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 100 సభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు