గ్లోబల్ హీరోలుగా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇద్దరు కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.వీరిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో నటించారు.
దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా గత ఏడాది మార్చిలో రిలీజ్ అయ్యి పెద్ద సంచలన విజయం నమోదు చేసుకుంది.
ఇక ఈ మధ్య ఏకంగా ఈ సినిమా లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడంతో ఈ ఇద్దరి స్టార్స్ కు గ్లోబల్ వైడ్ గా మరింత ఫాలోయింగ్ వచ్చేసింది.
ఇక ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో నెక్స్ట్ వీరు చేయబోతున్న సినిమాలకు భారీ అంచనాలు పెరిగి పోయాయి.ఆ మార్కెట్ ను నిలుపుకోవడానికి ఈ స్టార్ హీరోలు చాలా కష్ట పడుతున్నారు.
ప్రెజెంట్ వీరు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.

రామ్ చరణ్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి.గేమ్ ఛేంజర్ (Game Changer) అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది.ఇక కియారా అద్వానీ ( Kiara Advani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ముందు అనుకున్నారు.కానీ ప్రభాస్, మహేష్ ఈ పండుగకు బెర్త్ లు కన్ఫర్మ్ చేసుకోవడంతో వీరు వెనక్కి తగ్గారు.

ఇక ఈ సినిమాను మార్చి 20న రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.ఇదే నిజమైతే రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలు కొద్దీ గ్యాప్ తోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న 30వ (NTR30) సినిమా 2024, ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు.దీంతో ఈ రెండు సినిమాలు కొద్దీ గ్యాప్ తోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇదే నిజమైతే ఈ ఇద్దరి హీరోల మధ్య క్లాష్ తప్పదని అంటున్నారు.చూడాలి చరణ్ ఎప్పుడు తన సినిమాతో వస్తాడో.







