హైదరాబాద్ : చంచలగూడ జైలులో ఉన్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ తదితరులను ములాఖత్ ద్వారా కలుసుకొని పరామర్శించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.ఈటల రాజేందర్ కామెంట్స్.తప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ.కానీ శిక్ష అనుభవిస్తుంది బీజేవైఎం యూత్ నాయకులు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైనట్లే ఉద్యోగాల కల్పనలో కూడా విఫలమైంది.30 లక్షల మంది విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టింది.సంవత్సరాల తరబడి కళ్ళు కాయలు కాసేటట్లు చదివి.కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలకు ఖర్చుపెట్టి పరీక్ష రాస్తే పేపర్ లీకైంది.TSPSC డబ్బులకు పేపర్లు అమ్ముకునేవాళ్ల, బ్రోకర్ల రాజ్యమైంది.గతంలో టీఎస్పీఎస్సీ అంటే ఒక గౌరవం నమ్మకం ఉండేది.
కానీ కెసిఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ మీద నమ్మకం పూర్తిగా పోయింది.
దోషులను శిక్షించాల్సింది పోయి, వారిని కటకటాలకు పంపించాల్సింది పోయి బీజేవైఎం నాయకులు భాను ప్రకాష్ తో సహా 11 మందిని చంచలగూడ జైల్లో పెట్టారు.14 రోజులుగా వారు జైల్లో మగ్గుతున్నారు.వారికి ములాఖాత్ కూడా ఇవ్వడం లేదు.
వారేమీ క్రిమినల్స్ కాదు.ప్రభుత్వం విఫలమైంది 30 లక్షల మంది యువత జీవితాలతో చెలగాటమాడుతోంది.
ఆక్రోషించి టిఎస్పిఎస్సి దగ్గరకు పోతే గేటు బయటనే ఉన్న వారిపై అనేక రకాల సెక్షన్ పై కేసు పెట్టారు.బెయిల్ రాకుండా చేయడం.
పిపిలను లీవ్ పెట్టించడం.జైల్లో మగ్గేటట్టుగా స్కెచ్ వేసి హింస పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడదు.
కుట్రలకు భయపడదు.
కెసిఆర్ దుర్మార్గాలను పాతర వేసే దాకా భారతీయ జనతా పార్టీ నిద్రపోదని హెచ్చరిస్తున్నా…11 మంది జైలులో ఉండవచ్చు కానీ 30 లక్షల మంది విద్యార్థులు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు, గర్వపడుతున్నారు.కేసీఆర్ ప్రభుత్వాన్ని నాలుగు డిమాండ్స్ చేస్తున్నాం.
తక్షణమే దోషులకు శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం,వెంటనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.మీ సిట్ ల మీద విశ్వాసం లేదు వెంటనే సిట్టింగ్ చేత విచారణ జరిపించాలని కోరుతున్నాం.
టీఎస్పీఎస్సీ దొంగలకు బ్రోకర్లకు నిలయంగా మారింది కాబట్టి రద్దుచేసి వారి స్థానంలో నిష్ణాతులైన వారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం.