రాజన్న సిరిసిల్ల జిల్లా : పదవతరగతి ఫలితాల్లో జిల్లాలోనే 100 /100 శాతం టెన్ బై టెన్ జిపి ఉత్తీర్ణత సాధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఎల్లారెడ్డిపేట విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో 2022-23 విద్యాసంవత్సర పదవతరగతి విద్యార్థులకు అదే పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్ధులు శనివారం సాయంత్రం ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి,ఎంపిటీసీ సభ్యురాలు పందిళ్ళ నాగరాణి, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ,పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు బాధ గోపి ,
ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్ , పాఠశాల కరస్పాండెంట్ ఎండి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం లో గత 24 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి ఏటా జిల్లాలోనే పదవతరగతి లో వందకు వంద శాతం ఉత్తీర్ణత తో టెన్ బై టెన్ జి పి సాదిస్తూ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ యాజమాన్యం పాఠశాల విద్యార్థులను అణిముత్యాలను అందిస్తున్నారని ఆయన అభినందించారు.విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు
ఈ సంవత్సరం కూడా మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాల యాజమాన్యానికి, తల్లి దండ్రులకు మంచి పేరు తేవాలని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి అన్నారు.అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ లతీఫ్, కరస్పాండెంట్ శరత్ లు విద్యార్థుల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ను వివరించారు.
అనంతరం ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరిని ఎంతగానో అలరించాయి.విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఐఐటీ పరీక్షలో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికేట్లు , మేడల్స్ ను ప్రశంసాపత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.