ఈ మధ్య కాలంలో మంచు హీరోలు విష్ణు( Vishnu ) మరియు మోహన్ బాబు( Mohan Babu ) ఏ సినిమాలు చేసినా కూడా వాటి ఫలితం తో సంబంధం లేకుండా కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.ఆ ట్రోల్స్ వల్ల సినిమా లు బాగున్నా కూడా మినిమం వసూళ్లు రాబట్టలేక పోయాయి.
ముఖ్యంగా జిన్నా సినిమా పర్వాలేదు అన్నట్లుగా ఉంది.కలెక్షన్స్ కూడా మినిమం సాధించే కంటెంట్ ఉన్న సినిమా అది.అయినా కూడా దారుణమైన ట్రోల్స్ కారణంగా సినిమా మినిమం వసూళ్లను కూడా సాధించలేక పోయింది.అసలు సినిమా ఎందుకు అలా పోయిందో అర్థం కాదు అంటూ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మోహన్ బాబు మరియు విష్ణు ల యొక్క సినిమా లను సోషల్ మీడియాలో అత్యంత నీచంగా కొందరు ట్రోల్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి అనే విషయం చాలా మందికి తెలుసు.అయితే ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మంచు విష్ణు మరియు మోహన్ బాబు సినిమాలను కొందరు ట్రోల్స్ చేస్తున్నారు అనే విషయంలో కూడా నిజం లేకపోలేదు.

కొందరు కావాలని మోహన్ బాబు ఫ్యామిలీని టార్గెట్ చేశారు అనేది ఆరోపణ.ఆ విషయం పక్కన పెడితే ఆ ట్రోలర్స్ ఇప్పుడు మోహన్ బాబు మరియు విష్ణు లను చేసినట్లుగా మనోజ్( Manoj ) ను ట్రోల్స్ చేయకూడదని నిర్ణయించుకున్నారట.ఈ విషయంలో సోషల్ మీడియాలో మనోజ్ గురించి పాజిటివ్ టాక్ వస్తోంది.ఈ మధ్య కాలంలో మనోజ్ నుండి సినిమాలు రాలేదు కనుక వారు పెద్దగా పట్టించుకోలేదు.
వస్తే ఎలా ఉంటుంది అనేది త్వరలో వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.మనోజ్ తన తండ్రి మరియు అన్నతో పోల్చితే కాస్త పద్దతిగా ఉంటాడు అని.అందుకే ఆయన్ను ట్రోల్స్ చేయకుండా ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆ విషయంలో విష్ణు మరియు మోహన్ బాబులతో పోల్చితే మనోజ్ కు ఊరట దక్కడం ఖాయం.







