న్యాచురల్ స్టార్ నాని( Nani ) తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. దసరా( Dasara ) మూవీ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నాని కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే కొంతమంది డైరెక్టర్లు తనను డ్రైవర్ గా కూడా వాడుకున్నారంటూ నాని షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఒకరిద్దరు కో డైరెక్టర్లు నన్ను డ్రైవర్ గా వాడుకున్నారని నాని అన్నారు.
నటుడిగా అవకాశాల కొరకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.ఒక చిన్న రోల్ కోసం కూడా నాకు ఎవరూ కాల్ చేయలేదని నాని అన్నారు.
పండుగల కోసం నేను దాచుకున్న డబ్బులను సైతం వాళ్లు కొట్టేశారని అలాంటి మోసాలను తాను ఫేస్ చేశానని నాని అన్నారు.

మళ్లీమళ్లీ మోసపోవడం నా వల్ల కాదని భావించి అలాంటి ప్రయత్నాలను నేను ఆపేయడం జరిగిందని నాని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా మారానని ఆయన తెలిపారు.మళ్లీ మళ్లీ మోసపోకూడదని భావించి యాక్టర్ గా ప్రయత్నాలను ఆపేశానని నాని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారానని నాని తెలిపారు.ఊహించని విధంగా అష్టాచమ్మాలో ఛాన్స్( Ashta Chamma ) దక్కిందని నాని పేర్కొన్నారు.

హీరోగా సక్సెస్ కానని నేను అనుకున్నానని నా ఒపీనియన్ తప్పని తర్వాత అర్థమైందని నాని చెప్పుకొచ్చారు.నాని చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.నాని సినిమాలకు రికార్డ్ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.నాని దసరా సినిమాతో మరోసారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోల జాబితాలో స్థానం సంపాదించుకుంటానని నమ్ముతున్నారు.







