జీన్స్ సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

అప్పట్లో తెలుగు సినిమాలతో పోటీ పడి మరి తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయ్యేవి… ముఖ్యంగా మణిరత్నం, శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు ఇక్కడ రిలీజ్ అయి మంచి విజయాలను అందుకునేవి అందులో భాగంగానే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన జీన్స్ సినిమా( Jeans Movie ) కూడా తెలుగులో రిలీజ్ అయి అప్పటివరకు ఉన్న సినిమాల్లో ఒక మంచి లవ్ స్టోరీ గా పేరు సంపాదించుకుంది.ఈ సినిమాలో ప్రశాంత్( Prasanth ) హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే,.

 Hero Nagarjuna And Abbas Missed Director Shankar Jeans Movie Details , Abbas ,na-TeluguStop.com

హీరోయిన్ గా అందాల సుందరి ఐశ్వర్య రాయ్( Aishwarya rai ) నటించారు.

అయితే ఈ సినిమాతో తెలుగు లో ఐశ్వర్య రాయ్ కూడా మంచి పేరు సంపాదించుకుంది…ఇక్కడి వరకు భాగానే ఉంది, కానీ ఈ సినిమాలో మొదట హీరోగా శంకర్ వేరే వాళ్ళని అనుకున్నారట.

 Hero Nagarjuna And Abbas Missed Director Shankar Jeans Movie Details , Abbas ,na-TeluguStop.com

వాళ్లెవరు అంటే ప్రేమదేశం సినిమాతో మంచి హిట్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అబ్బాస్ అయితే ఈ క్యారెక్టర్ కి బాగుంటాడు అని శంకర్ అనుకున్నాడట, కానీ అబ్బాస్( Abbas ) అప్పటికి చాలా సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల ఆయన ఈ సినిమా చేయలేకపోయారట.

ఆ తరువాత శంకర్ తెలుగు హీరో అయినా నాగార్జునని( Nagarjuna ) కూడా అడిగాడట అప్పడు ఆయనకి కూడా డేట్స్ లేక వదిలేసుకున్నాడట…ఇక చేసేదేంలేక శంకర్ ప్రశాంత్ ని పెట్టి ఈ సినిమా తీసారు.ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో కూడా సూపర్ హిట్ అయిందనే చెప్పాలి…ఇలా ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు తరువాత ఈ ఇద్దరు హీరోలు కూడా చాలా భాదపడ్డట్టు తెలుస్తుంది…

ఇక ఆ విషయాలు పక్కన పెడితే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా కనక హిట్ అయితే మళ్లీ శంకర్ హిట్ ట్రాక్ ఎక్కుతాడు.ఎందుకంటే శంకర్ గత రెండు మూడు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆయన మార్కెట్ కూడా బాగా డల్ అయిందనే చెప్పాలి…ఈ సినిమాతో శంకర్ మళ్లీ బౌన్స్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube