ఆ ముగ్గురూ రెఢీ నా ? మంతనాలు మొదలుపెట్టారా బాబు ?

ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కాలం కలిసి వచ్చినట్లుగానే కనిపిస్తోంది ఆశలు వదిలేసుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను దక్కించుకోవడంతో పాటు రెండు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అనూహ్యంగా టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ( Panchumurti Anuradha ) గెలుపొందడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని కలిగిస్తోంది వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేయడంతోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు దీంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu )చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.

 Are Those Three Ready Have You Started Discussions, Babu Ap Cm Jagan, Tdp,cbn, C-TeluguStop.com

వరుస వరుసగా వస్తున్న విజయాలతో టీడీపీ బలం పుంజుకుందనే అభిప్రాయాలు జనాల్లోనూ వచ్చాయని టీడీపీ అంచనా వేస్తోంది.ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాల గిరి  ప్రస్తుతం వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు.ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోను వారు వైసీపీకి మద్దతు తెలిపారు.

వీరిలో వల్లభనేని వంశీ మినహా, మిగిలిన ముగ్గురు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలువడుతుండడంతో, చంద్రబాబు కూడా ఎందుకు ఆసక్తిగా ఉన్నారట.

వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తుండడంతో పాటు,  తమ పార్టీ నుంచి వెళ్లిన నలుగురిలో ముగ్గురు వెనక్కి వచ్చే అవకాశం ఉండడంతో చంద్రబాబు స్పీడ్ పెంచారు ఈ మేరకు మంచి వైసీపీకి అనుబంధం గా కొనసాగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారట.ఇదే జరిగితే వైసీపీ ఆత్మరక్షణలో పడిపోతుందని, టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది అనే అంచనాలో చంద్రబాబు ఉన్నారట.ఏది ఏమైనా రాబోయే ఎన్నికల నాటికి ఏదో రకంగా పై అధికార పార్టీ వైసీపీ పై పై చేయి సాధించాలనే పట్టుదల చంద్రబాబులో కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube